Thursday, 24 September 2026 08:59:28 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

తెలంగాణ సంస్కృతికి మొహర్రం ప్రతీక: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి*

*పటాన్చెరులో షర్బత్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం*

Date : 26 June 2026 04:41 PM Views : 112

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్ 26 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, గంగా-జమునీ తెహజీబ్‌కు మొహర్రం పర్వదినం ప్రతీకగా నిలుస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని జీఎంఆర్ యువసేన నాయకులు షకీల్ ఆధ్వర్యంలో శుక్రవారం పటాన్చెరు బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొహర్రం త్యాగం, సహనం, మానవతా విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. పీర్ల రూపంలో అమరవీరులను స్మరించుకునే ఈ పర్వదినం అన్ని మతాల ఐక్యత, సౌభ్రాతృత్వానికి చిహ్నంగా నిలుస్తుందని అన్నారు.పటాన్చెరు నియోజకవర్గంలో కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, వెంకటేష్, మిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :