Friday, 25 September 2026 10:14:47 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

ముత్తంగి సమగ్ర అభివృద్ధికి కృషి – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రూ.2.37 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Date : 03 July 2026 01:36 PM Views : 159

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో రూ.2 కోట్ల 37 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువలు, బోర్‌వెల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, రక్షిత మంచినీటి వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ముత్తంగి డివిజన్‌ను అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనుల కోసం దశలవారీగా నిధులు కేటాయిస్తూ, నిర్దేశిత గడువులోనే పనులను పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, ఇంజినీరింగ్ విభాగం డీఈ కృష్ణవేణి, ఏఈ ఫైజాన్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కిట్టు, మేరాజ్ ఖాన్, సందీప్, ఆబీద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :