Friday, 25 September 2026 12:21:42 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

అనాథ వృద్ధుడికి కుటుంబ సభ్యులుగా నిలిచిన ఎండీఆర్ ఫౌండేషన్*

గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించిన సేవా సంస్థ*

Date : 09 September 2026 06:54 PM Views : 46

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో రోడ్డుపై అనాథగా జీవిస్తున్న ఓ వృద్ధుడు మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం వృద్ధుడు మృతి చెందిన విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి ఆయనను చికిత్స నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువుల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఎండీఆర్ ఫౌండేషన్‌ను సంప్రదించారు. అనాథలు, నిరాశ్రయులకు అండగా నిలుస్తూ మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు వృద్ధుడిని తమ కుటుంబ సభ్యుడిగా భావించారు.ఈ మేరకు వృద్ధుడికి ఈరోజు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో కూడా ఓ మనిషి చివరి ప్రయాణంలో మానవత్వం తోడుగా నిలవాలనే సంకల్పంతో ఎండీఆర్ ఫౌండేషన్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది.అనాథలు, నిరాశ్రయుల పట్ల మానవతా దృక్పథంతో స్పందిస్తూ, వారి చివరి ప్రయాణాన్ని సైతం గౌరవప్రదంగా నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకుంది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :