Friday, 25 September 2026 03:30:10 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

పటాన్‌చెరు మార్కెట్ యార్డులో ఘనంగా అన్నదాన కార్యక్రమం

హాజరైన సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాటా సుధారాణి

Date : 17 September 2026 11:58 AM Views : 33

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలోని మార్కెట్ యార్డులో గణేష్ నవరాత్రుల్లో భాగంగా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, వారి సతీమణి కాటా సుధారాణి ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్నదానం మహాదానమని, భక్తి భావంతో చేపట్టే ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం మాట్లాడుతూ తనపై నమ్మకంతో మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పదవి బాధ్యతలు అప్పగించిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. మార్కెట్ యార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్ యార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా భక్తులకు అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజలకు, వ్యాపారులకు ఉపయోగపడే మరిన్ని అభివృద్ధి, సేవా కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శశిధర్ రెడ్డి ,వడ్డే కృష్ణ,ఆదిత్య రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప నాగేష్ యాదవ్ ,బీరంగుట్ట దేవాలయ చైర్మన్ , సుధాకర్ యాదవ్,బండ్లగూడ మాజీ సర్పంచ్ జయమ్మ ,సంజీవ,మార్కెట్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, భక్తులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :