ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో గల ప్రముఖ ఇంద్రేశ్వర దేవాలయంలో చోరీ జరిగింది. ఈ నెల17వ తేదీ అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి శివలింగానికి అలంకరించిన నాగాభరణంతో పాటు హుండీలోని నగదును అపహరించారు.ఆదివారం ఉదయం నిత్యపూజల కోసం ఆలయానికి వచ్చిననిర్వాహకులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికిచేరుకుని పరిశీలించారు. ఆలయంలోని సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకుని,ఇతర ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని,ఆలయాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని వారు పోలీసు అధికారులను కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు