Friday, 25 September 2026 10:15:01 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

రూ.8.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అమీన్పూర్‌ను అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

Date : 22 August 2026 04:51 PM Views : 48

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్పూర్: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు కాలనీల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.శనివారం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని రాజేంద్రరెడ్డి కాలనీ, సాయి అంబిక కాలనీ, పీఎన్‌ఆర్ కాలనీ, నరేంద్రనగర్, సాయిరామ్ ఎన్‌క్లేవ్, శంకర్ గ్రీన్ హోమ్స్, బృందావన్ టీచర్స్ కాలనీ, నవ్య నందనవనం, నర్రేగూడెం రాజీవ్ గృహకల్ప కాలనీల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పర్యటించారు. మొత్తం రూ.8.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా కాలనీల ప్రజలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులతో నేరుగా సమావేశమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, యూజీడీ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అమీన్పూర్ పరిధిలో దశాబ్దాలుగా ఉన్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాలకు తాగునీటి సరఫరా అందిస్తున్నామని, కొత్తగా ఏర్పడుతున్న కాలనీలకు కూడా తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమణలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పార్కులను అభివృద్ధి చేసి పచ్చదనాన్ని పెంచుతున్నామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన మేరకు అదనపు సిబ్బందిని నియమించి నిరంతరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.అమీన్పూర్‌లో కొత్త కాలనీలు వేగంగా విస్తరిస్తుండటంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్లు, అదనపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.అభివృద్ధి పనుల నాణ్యతను ప్రజలు కూడా పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేస్తూ, అవసరమైన చోట అదనపు నిధులు సమకూర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అమీన్పూర్‌లో అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ప్రతి కాలనీలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్‌కుమార్, మాజీ ఎంపీపీ దేవానందం, డీఈ వెంకటరమణ, మాజీ కౌన్సిలర్ కృష్ణ, ఉపేందర్‌రెడ్డి, కొల్లూరి చంద్రకళ గోపాల్, కొల్లూరి మల్లేష్, బిజిలి రాజు, నవనీత జగదీష్, బోయిని బాలమణి బాలరాజు, యూసుఫ్, మాజీ కోఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, యూనుస్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కొల్లూరి యాదగిరి, నల్ల మాధవరెడ్డి, తుమ్మల ప్రతాప్‌రెడ్డి, మకాం మల్లేష్, బాల్‌రెడ్డి, చంద్రశేఖర్, నరసింహరెడ్డి, ఐలాపూర్ నర్సింగ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :