ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయరావు చెరువులో ఓ వ్యక్తి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. సదరు వ్యక్తి గత రోజే చెరువులో పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మృతుడు నర్సాపూర్ పట్టణానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
ప్రజా పిలుపు