ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * ఇస్నాపూర్‌లోని సెయింట్ మేరీస్ గ్రామర్ హైస్కూల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు షెహనాజ్ బేగం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జి. విలియం జేమ్స్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులే పాఠశాలకు ప్రధాన స్తంభాలని అన్నారు. విద్యార్థులకు విద్యాబోధన అందించడంలో ఉపాధ్యాయులు ఎన్నో త్యాగాలు చేస్తారని తెలిపారు. విద్యార్థుల భోజనం పాడైపోయిన సందర్భాల్లో తమ భోజనాన్ని సైతం వారితో పంచుకుంటారని, పరీక్షల సమయంలో కుటుంబ పరిస్థితులను పక్కనపెట్టి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు.ప్రస్తుత తరం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ జ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు.విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నప్పుడు ఉపాధ్యాయులు ఎంతో గర్వపడతారని అన్నారు.విద్యార్థులను బాధ్యతాయుతమైన, మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని జి. విలియం జేమ్స్ తెలిపారు.
Admin
ప్రజా పిలుపు