ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్ మండలం నాత్నాయిపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ భూమి కబ్జా బాగోతం బయటపడింది.గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 119/1 లో గల సుమారు 3 నుండి 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేసి, చుట్టూ పలకలు వేసి ఆక్రమించుకున్నట్లు* గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అసలు విషయం హైదరాబాద్ కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ భూములు కొనుగోలు చేసి, దానికి ఆనుకొని ఉన్న పట్టా సర్వే నంబర్ ను చూపించి, సర్వే నం. 119/1 లో గల ప్రభుత్వ భూమిని చూపించి అమ్మకాలు, కొనుగోళ్లు సాగిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అంటే పట్టా భూమి పేరు చెప్పి ప్రభుత్వ భూమిని అమ్ముతున్నారని, అమాయకులను మోసం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. దీనిపై రెవెన్యూ, తహశీల్దార్ అధికారులు వెంటనే స్పందించి సర్వే నం. 119/1 ను క్షేత్రస్థాయిలో సర్వే చేయించి, ప్రభుత్వ భూమిని పరిరక్షించి, కబ్జాదారులపై, అక్రమ రిజిస్ట్రేషన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
ప్రజా పిలుపు