Monday, 09 November 2026 02:59:50 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

జన్వాడ ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ నేతలు.. భారీగా పోలీసు మోహరింపు

కాంగ్రెస్ బృందం భూములు, నిర్మాణాలను పరిశీలన.. అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ శ్రేణుల యత్నం

Date : 19 September 2026 08:34 PM Views : 85

ప్రజా పిలుపు / తెలంగాణ / రంగారెడ్డి : జన్వాడ, సెప్టెంబర్ 19 (ప్రజా పిలుపు): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలోని ఫామ్‌హౌస్ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం శనివారం ఫామ్‌హౌస్ వద్దకు చేరుకుని భూములు, నిర్మాణాలు, యాజమాన్య వివరాలను పరిశీలించింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ఫామ్‌హౌస్ నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించారు. భూములు, నిర్మాణాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేసేందుకే తాము పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఫామ్‌హౌస్ పరిసరాల్లో భూముల రికార్డులు, యాజమాన్య వివరాలను పరిశీలించారు.కాంగ్రెస్ నేతల రాకను నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఫామ్‌హౌస్ వద్దకు చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ బృందం ప్రయాణిస్తున్న బస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ బీఆర్‌ఎస్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉండగా, ఫామ్‌హౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి తనదేనని, కేటీఆర్‌కు లీజుకు ఇచ్చినట్లు గతంలో స్పష్టం చేశారు. భూమికి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని, ఎలాంటి వివాదం లేదని ఆయన పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ఆరోపణలు, ఫామ్‌హౌస్ యజమాని వివరణల మధ్య జన్వాడలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ బృందం వెంట ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉండగా, బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :