ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: వర్షాకాలం నేపథ్యంలో పటాన్‌చెరు మార్కెట్ యార్డు మొత్తం బురదమయంగా మారింది. మార్కెట్‌లో అడుగడుగునా బురద పేరుకుపోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కూరగాయల వ్యాపారులు తమ సరుకులను విక్రయించేందుకు ఇబ్బందులు పడుతుండగా, కొనుగోలుదారులు మార్కెట్‌లో నడవడానికే తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బురద కారణంగా జారిపడే ప్రమాదం కూడా ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మార్కెట్ యార్డులో పేరుకుపోయిన బురదను తొలగించి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టి వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, స్థానికులు మరియు కొనుగోలుదారులు కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు