Friday, 25 September 2026 10:02:26 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

శివానగర్ లో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Date : 24 June 2026 06:53 PM Views : 90

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకం పెరిగేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ పరిధిలోని శివానగర్ గ్రామంలో న్యూల్యాండ్ పరిశ్రమ 60 లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో నిర్మించిన జడ్పీహెచ్ఎస్ అదనప తరగతి గదులను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యావ్యవస్థల బలోపేతానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న క్షేత్రస్థాయిలోని కొన్ని పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శివానగర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య అతి తక్కువగా ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలను వివరించి అడ్మిషన్లను పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం న్యూలాండ్ పరిశ్రమ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. అంగన్వాడి, ప్రాథమిక పాఠశాల భవనాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాపరెడ్డి, స్థానిక కౌన్సిలర్ కృష్ణ, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :