Thursday, 24 September 2026 08:55:48 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

అధైర్యపడకండి.. అండగా ఉంటాను: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి*

Date : 25 August 2026 10:28 PM Views : 65

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని బండలగూడ రైల్వే భూముల అంశంలో నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానిక ప్రజాప్రతినిధిగా వారికి అండగా ఉంటానని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు.సోమవారం సాయంత్రం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ నేతృత్వంలోని నిర్వాసితుల బృందం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించి, న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బండలగూడలో గత 50 ఏళ్లుగా గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న నిరుపేదల ఇళ్లను రైల్వే భూముల పేరుతో ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు. పేద ప్రజల సమస్యను పరిష్కరించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలిపారు.ఈ విషయంపై సంబంధిత రైల్వే అధికారులతో చర్చిస్తానని, అవసరమైతే నిర్వాసితుల తరఫున భారీ నిరసన కార్యక్రమం చేపట్టేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :