ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రామచంద్రాపురం: 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతి నగర్, రామచంద్రాపురం డివిజన్లలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పలు ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.రామచంద్రాపురం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎల్‌ఐజీ కాలనీలోని విద్యాభారతి ఉన్నత పాఠశాల, ఎంఐజీ కాలనీలోని వాణి విద్యా నికేతన్ పాఠశాల, సీనియర్ సిటిజన్ భవన్, సర్కిల్ కార్యాలయం, సొసైటీ వర్కర్స్, ఓల్డ్ ఎంఐజీ సొసైటీ కార్యాలయం, మ్యాక్ సొసైటీ కాలనీ, ఎల్‌ఐజీ సొసైటీ కార్యాలయం, శారద మహిళా మండలి, వార్డు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.అలాగే మహిమా ఆసుపత్రిలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, అక్కడ ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు.ఆదర్శ్ రెడ్డి గీత భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండల కార్యాలయం, కియా వాహన ప్రదర్శనశాల, రామచంద్రారెడ్డి నగర్ కాలనీ, నెహ్రూ విగ్రహం, మ్యాక్ సొసైటీ, ఈఎస్ రోడ్‌లో జైపాల్, జాకీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైల్వే ట్రాక్ వద్ద కావలి రాములు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంతో పాటు జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల పోరాటం, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.
Admin
ప్రజా పిలుపు