Monday, 09 November 2026 03:17:58 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పుల్కల్ మండలంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విస్తృత పర్యటన*

*కేజీబీవీ, పీహెచ్‌సీ తనిఖీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన

Date : 24 July 2026 04:51 PM Views : 104

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం కల్పించ డానికి సంబంధిత అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.శుక్రవారం కలెక్టర్ పుల్కల్ మండలంలో పర్యటించి మండల కేంద్రంలోనీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , బస్వాపూర్‌ పరిధిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించారు. ముందుగా బస్వాపూర్‌ పరిధిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.తదుపరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన కలెక్టర్, నూతనంగా నిర్మించిన పి హెచ్ సి భవనాన్ని పరిశీలించారు. భవనాన్ని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని,త్వరగా మంత్రి చేత ప్రారంభించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మెడికల్ ఆఫీసర్ కు సూచించారు.అనంతరం పుల్కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పాఠశాల ఆవరణ, డార్మిటరీ, తరగతి గదులు, స్టోర్‌రూమ్, వంటశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఈగలు, దోమలు పెరగకుండా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్వాహకులను ఆదేశించారు.ఆహార పదార్థాలు కలుషితం కాకుండా పరిశుభ్రతను పాటిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు.విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పాఠశాల నిర్వాహకులను ఆదేశించారు.6వ తరగతి విద్యార్థినులతో ప్రత్యక్షంగా మాట్లాడిన కలెక్టర్, వారితో పాఠ్యాంశాలను చదివించి అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థినులకు నోట్‌బుక్‌లను అందజేశారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని వారికి ఉద్భోదించారు. కలెక్టర్ వెంట ఆయా కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, ఎం ఈ ఓ, కేజీబీవీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :