Thursday, 24 September 2026 09:40:33 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

మదర్ థెరిసా ‘సేవారత్న’ పురస్కారాల ప్రదానం

Date : 26 August 2026 02:58 PM Views : 103

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మాదాపూర్‌లోని స్వాతి హైస్కూల్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమానికి హెచ్‌సీయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా, రాగం మల్లికార్జున యాదవ్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మదర్ థెరిసా జీవితంలోని స్ఫూర్తిదాయకమైన అంశాలను వివరించారు. పేదలు, అనాథలు, రోగుల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతావాది మదర్ థెరిసా అని కొనియాడారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే సూత్రంతో సమాజంలో అట్టడుగున ఉన్న వారి కోసం ఆమె ఎనలేని కృషి చేశారని తెలిపారు. 1950లో కేవలం 13 మంది సభ్యులతో ప్రారంభమైన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని గుర్తుచేశారు. మరణశయ్యపై ఉన్న నిరుపేదలు, అనాథలకు ఆశ్రయం కల్పించేందుకు కలకత్తాలోని కాళీఘాట్‌లో ఏర్పాటు చేసిన ‘నిర్మల్ హృదయ్’, అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ‘శిశు భవన్’ వంటి సంస్థలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనాలని పేర్కొన్నారు.అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ సమాజంలో ‘మానవ సేవే మాధవ సేవ’గా భావించి వివిధ రంగాల్లో అంకితభావంతో సేవలందిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు ‘సేవారత్న’ పురస్కారాలను అందిస్తున్నామని తెలిపారు.స్వాతి హైస్కూల్ ప్రిన్సిపాల్ చంద్రిక మాట్లాడుతూ మదర్ థెరిసా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె స్థాపించిన సంస్థల ద్వారా దయ, కరుణ, సేవాభావం నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు.ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన శ్రీమతి ఎం. అరుణ, శ్రీ ఎం. వెంకటరావు, డాక్టర్ కె. అరుణశ్రీ, డాక్టర్ రాజ్ కుమార్ లట్టుపల్లి (జాయ్ ఫౌండేషన్), శ్రీ జి.ఎస్.డి. గుప్తా (షిరిడీ సాయిబాబా అసోసియేషన్, రిటైర్డ్ బీహెచ్‌ఈఎల్ ఏజీఎం)లకు అతిథుల చేతుల మీదుగా దుశ్శాలువ, జ్ఞాపిక, పగిడి, తాంబూలంతో ‘సేవారత్న’ పురస్కారాలను అందజేశారు.పురస్కార గ్రహీతలు తమ సేవలకు తగిన గుర్తింపు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ ప్రోత్సాహంతో మరింత మందికి స్ఫూర్తినిచ్చేలా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.కార్యక్రమంలో స్వాతి హైస్కూల్ ప్రిన్సిపాల్ చంద్రిక, కొత్తపల్లి కోటేశ్వరరావు, డాక్టర్ రామన్న, డి.వి.కె.రావు, సుబ్బారావు, వాణీ సాంబశివరావు, విష్ణు ప్రసాద్, పాలం శీను, శివరాం రెడ్డి, బాలన్న, డాక్టర్ సాంబశివరావు, తెలుగు శాంతికుమార్, డాక్టర్ లతాగుప్త, సత్యనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :