Thursday, 24 September 2026 08:55:43 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

మైనర్ బాలిక అపహరణకు యత్నం.. తల్లిదండ్రులపై దాడి*

ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పటాన్‌చెరు పోలీసులు*

Date : 02 September 2026 05:57 AM Views : 47

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు.ఇంద్రేశంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.పటాన్ చేరు పోలీసుల వివరాల ప్రకారం.. ఇంద్రేశంలో నివసించే మైనర్ బాలికతో మహమ్మద్ అలీం పాషా (24) పరిచయం పెంచుకున్నాడు. బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి గతంలో లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. బాలిక తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించకపోవడంతో వారిని బెదిరించి బాలికను అపహరించేందుకు తన స్నేహితులైన వడ్డే రాజేష్ అలియాస్ శివరాత్రి రాజేష్, ముద్దం రాజుతో కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.ఆగస్టు 30వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో ముగ్గురు కలిసి బాలికను అపహరించాలని, తల్లిదండ్రులు అడ్డుకుంటే వారిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కట్టె, మద్యం సీసాలతో బాలిక కుటుంబం నివసిస్తున్న గుడిసె వద్దకు వెళ్లారు.మహమ్మద్ అలీం పాషా, వడ్డే రాజేష్‌లు బాలిక తండ్రిని గుడిసె నుంచి బయటకు లాగి తీసుకువచ్చి దాడి చేశారు. అలీం పాషా కట్టెతో అతడి చేతులు, కాళ్లపై కొట్టగా.. రాజేష్ మద్యం సీసాతో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాలిక తల్లిపై అలీం పాషా రాయితో ముఖంపై దాడి చేశాడు. ముద్దం రాజు కూడా మద్యం సీసాతో బాలిక తండ్రిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అడ్డుగా వచ్చిన బాలిక సోదరిని అలీం పాషా కొట్టి నెట్టివేశాడు.దాడి అనంతరం అలీం పాషా బాలికను బలవంతంగా తన వెంట తీసుకెళ్లాడు. పోలీసులు వస్తున్నట్లు గమనించి ఇంటి వెనుక వైపు నుంచి పరారయ్యాడు. అయితే సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం సుమారు 11 గంటలకు తన ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో పటాన్‌చెరు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం రాజేష్, ముద్దం రాజులను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా, నేరంలో తమ పాత్రను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహితలోని 331(6), 109, 137(2), 3(5) సెక్షన్లతో పాటు బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టంలోని 5,6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముగ్గురు నిందితుల గత నేర చరిత్రను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.మైనర్ బాలికలు, మహిళల భద్రత విషయంలో పోలీసు శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని పోలీసులు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :