Monday, 09 November 2026 03:08:19 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఆరు నెలల గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య

మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన భర్త.. పోలీసుల విచారణలో వెలుగులోకి నిజం

Date : 15 September 2026 07:18 AM Views : 94

ప్రజా పిలుపు / తెలంగాణ / హైదరాబాదు : అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల గర్భిణీ అయిన భార్యను భర్త గొంతు నులిమి హత్య చేసిన ఘటన సూర్యనగర్‌లో కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యనగర్‌కు చెందిన పరశురామ్‌కు సుమారు ఏడాది క్రితం శివానితో వివాహం జరిగింది. పరశురామ్‌ ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన పరశురామ్‌ భార్య శివానితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అతడు ఆరు నెలల గర్భిణీ అయిన శివాని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం శివాని బాత్రూంలో జారిపడిందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. అయితే ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు పరశురామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :