ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పవిత్ర మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి నిర్వాహకులు ఆహ్వాన పత్రిక అందజేశారు.గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న ఈ మహోత్సవాలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపిటిసి కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూరారం సత్తయ్య తెలిపారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వేడుకలకు ఆహ్వానించారు.ఈ ఆహ్వాన కార్యక్రమంలో అనంతారం సర్పంచ్ కొమ్ము శ్రీను, మాజీ సర్పంచ్ బిక్షపతి యాదవ్, జింక గోపాల్, సాయిలు, కృష్ణ పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు