ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ దేవస్థానంలో నిర్వహించనున్న శ్రీ వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పత్రికను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్. లావణ్య, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, రాంరెడ్డి, పాండు, గ్రామ పెద్దలు, అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు