ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రుద్రారం.గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. 12 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడి లడ్డూను వేలం వేయగా భక్తులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.వేలం పాటలో రామచంద్రాపురం వాస్తవ్యులు ప్రత్యూష వరుణ్ రూ.4 లక్షల 30 వేల ధరకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యూష వరుణ్‌ను అభినందించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.
Admin
ప్రజా పిలుపు