ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సహా ఆ పార్టీ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం హౌస్ అరెస్టు చేయడాన్ని అమీన్‌పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మలపాండురంగారెడ్డితీవ్రంగాఖండించారు.సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక వసతుల కొరతను ప్రజలకు వివరించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, పోలీసులను అడ్డుపెట్టుకుని వారి గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర నేతలను హౌస్ అరెస్టు చేశారని విమర్శించారు. హౌస్ అరెస్టులతో బీఆర్ఎస్ నేతలను ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా అడ్డుకోలేరని, ప్రభుత్వ నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తుమ్మల పాండురంగారెడ్డి స్పష్టం చేశారు.
Admin
ప్రజా పిలుపు