ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని సిఎంసీ పటాన్‌చెరు డివిజన్ ఎంజీ రోడ్‌లోని చోటీ మజీద్ దుకాణ సముదాయంలో ఏర్పాటు చేసిన రాయల్ సోఫా మేకర్ నూతన షాపును ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ సోఫా మేకర్ షాపు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్థానికంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రజలకు వివిధ రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ ,నర్రా, బిక్షపతి, లియాఖత్ అలీ, లడ్డు బాయ్, పాషా బాయ్, బాబా సేట్, కొమరగూడెం వెంకటేష్, రాము పటాన్‌చెరు తదితర ప్రముఖులు, స్థానిక నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు. నూతన షాపు నిర్వాహకులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు