ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని కేసీఆర్‌ను జీఎంఆర్ ఆహ్వానించారు. అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కేసీఆర్‌కు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
ప్రజా పిలుపు