ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.రవీందర్‌ను పటాన్ చేరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించి, నూతన బాధ్యతల స్వీకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పటాన్ చేరు ప్రాంతంలోని శాంతిభద్రతలు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలపై స్వల్పంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో కార్ రాజు, సతీష్, అజ్మత్ అజ్జు, అఫ్జల్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు