ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం హర్షణీయమని మాద్రి పృథ్వీరాజ్ అన్నారు. పటాన్‌చెరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాద్రి దేవేందర్ రాజు తదితర ప్రముఖులతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలు, సాంకేతిక సదుపాయాలు, వివిధ విభాగాలను పరిశీలించారు. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పారిశ్రామిక ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానికంగానే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే ఆసుపత్రి ఏర్పాటు కావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు.వైద్య రంగంలో సాంకేతిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించడం కూడా అంతే ముఖ్యమని మాద్రి పృథ్వీరాజ్ పేర్కొన్నారు. వైద్యం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం, ఆత్మీయతతో కూడిన సేవలు అందించినప్పుడే వైద్య వృత్తికి నిజమైన గౌరవం లభిస్తుందని అన్నారు. ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ పటాన్‌చెరు ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో విశ్వసనీయ వైద్య కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు