ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందిగామ గ్రామ శివారులో, పెన్నో ప్లాస్ట్ కంపెనీ సమీపంలోని ఖాళీ స్థలంలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.మృతుడు అర్ధబాహువుల చొక్కా, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని కాలికి నల్ల దారంతో కట్టిన రాగి ఉంగరం, నడుముకు రెండు వరుసల నల్ల దారాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు