Friday, 25 September 2026 05:29:52 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

ఎస్సై కిష్టారెడ్డి పదవీ విరమణ అభినందన సభ

Date : 31 August 2026 03:45 PM Views : 44

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బొల్లారం డివిజన్‌ ఎస్సై పి. కిష్టారెడ్డి పదవీ విరమణ అభినందన సభను సోమవారం బొల్లారం సీఐ సుధీర్‌కుమార్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేర్లింగంపల్లి జోన్‌ అదనపు డీసీపీ ఉదయ్‌రెడ్డి, రామచంద్రాపురం డివిజన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పోలీసు శాఖలో వివిధ హోదాల్లో ఎస్సై కిష్టారెడ్డి అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని, ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కిష్టారెడ్డి దంపతులను పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధువులు ఘనంగా సన్మానించారు.అదేవిధంగా బొల్లారం డివిజన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఎం. రవీందర్‌రెడ్డి బదిలీపై వెళ్లడంతో పోలీసు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శేర్లింగంపల్లి జోన్‌ అదనపు డీసీపీ ఉదయ్‌రెడ్డి, రామచంద్రాపురం డివిజన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, బొల్లారం సీఐ సుధీర్‌కుమార్‌, పోలీసు సిబ్బంది రవీందర్‌రెడ్డిని సత్కరించారు.కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు లాలు నాయక్‌, ప్రవీణ్‌రెడ్డి, పదవీ విరమణ పొందిన ఎస్సై దశరథ్‌, బొల్లారం ఎస్సై అక్షిత, పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :