Friday, 25 September 2026 09:20:18 PM
# బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు*

*హామీలు నెరవేర్చకుండా సంగారెడ్డికి వస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన

Date : 13 August 2026 06:39 PM Views : 50

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డికి వస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత నిరసన చేపడతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌యాదవ్ తెలిపారు.ఈ నెల 15న ముఖ్యమంత్రి సంగారెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజల మధ్యకు రావడం సరికాదన్నారు.నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, విద్యార్థులు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, కళాశాలలకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలను గుర్తు చేసుకోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరారు.నిరుద్యోగులు, విద్యార్థులు, యువతకు న్యాయం చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలుపై స్పష్టత ఇవ్వకుండా ముఖ్యమంత్రి సంగారెడ్డికి వస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత నిరసన చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్ రవి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు నవాజ్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :