ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులను నియమించేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా చిట్కుల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు తమ విద్యార్హతలకు సంబంధించిన అసలు ధ్రువపత్రాలు, రెండు తాజా పాస్‌పోర్టు సైజు ఛాయాచిత్రాలతో చిట్కుల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించే ప్రదర్శన, ముఖాముఖి ఎంపికకు హాజరుకావాలని తెలిపారు.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం జిల్లా సమన్వయ అధికారి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, చిట్కుల్‌ను 9704550253, 9640382248 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
Admin
ప్రజా పిలుపు