Thursday, 24 September 2026 12:12:12 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

*ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజం*

ఎస్‌ఐలు కిష్టారెడ్డి, పవన్, రఫిక్ లకు ఘన వీడ్కోలు:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

Date : 31 August 2026 03:23 PM Views : 50

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమని, ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందడం గొప్ప విషయమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో ఎస్‌ఐలు కిష్టారెడ్డి, పవన్, రఫిక్ లను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగంలో సుదీర్ఘకాలం నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. ఒక ఉద్యోగి తన విధులను విజయవంతంగా నిర్వర్తించడంలో ఉద్యోగితో పాటు కుటుంబ సభ్యుల సహకారం, బాధ్యత కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు.ఎస్‌ఐ కిష్టారెడ్డి 1985లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరారని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించి, సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ సబ్‌-ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదగడం ఆయన నిబద్ధత, క్రమశిక్షణకు నిదర్శనమన్నారు.ఎస్‌ఐ పవన్ 1989లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరారని, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతో పాటు గ్రేహౌండ్స్ విభాగంలో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించారని ఎస్పీ తెలిపారు. పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించి, ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా పదోన్నతులు పొందుతూ ఎస్‌ఐ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు.ఎస్‌ఐ రఫిక్ 1989లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరి, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించారని తెలిపారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించి, ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ ఎస్‌ఐ స్థాయికి ఎదిగారని అన్నారు.పదవీ విరమణ అనంతరం ముగ్గురూ ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ప్రశాంతమైన జీవితం గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు. పోలీసు శాఖ తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్., అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్‌ఐ సురేష్, పదవీ విరమణ పొందుతున్న ఎస్‌ఐల కుటుంబ సభ్యులు, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :