ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి, వీరన్నగూడెంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం, అయ్యప్ప స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షులు శంబిపూర్ రాజు సందర్శించారు.ఆలయాలకు విచ్చేసిన శంబిపూర్ రాజుకు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు కుమార్ గౌడ్, జనార్ధన్, ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, నాయికోటి రాజేష్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు