Friday, 25 September 2026 10:02:28 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

బీహెచ్ఈఎల్ బస్టాప్ సమీపంలో 1.56 కిలోల గంజాయి స్వాధీనం

ఇద్దరు నిందితులు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

Date : 25 June 2026 09:08 AM Views : 109

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పరిధిలోని బీహెచ్ఈఎల్ బస్టాప్ సమీపంలో అబ్కారీ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 1.56 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.అధికారుల వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఎస్కే రుహిల్ అమిన్, ఎస్కే మోజాయిదుల్ ఇస్లాం అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.56 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.నిందితులను విచారించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :