ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 22ఏ ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న భూములను తక్షణమే తొలగించాలని అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 29న తహసీల్దార్ కార్యాలయ ముట్టడి చేపడతామని తెలిపారు.హెచ్‌ఎండీఏ అనుమతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లు, పీఎస్‌ఆర్ కాలనీతో పాటు పలు ప్రాంతాల భూములను 22ఏ జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పాండురంగారెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ప్లాట్లు, పేదలకు కేటాయించిన స్థలాలు, సర్వే నంబర్ 157లోని చత్రపురి కాలనీ భూములను సైతం జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ నెల 29న జరిగే ఆందోళనలో కాలనీవాసులు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు భాషెట్టి కృష్ణ, రాజు, కొల్లూరు గోపాల్, ఉపేందర్ రెడ్డి, తలారి రాములు, యునుస్, కాలనీ ప్రతినిధులు, బాధితులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు