Sunday, 08 November 2026 02:46:34 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కేసీఆర్ పార్క్ భూమిని పరిరక్షించాలి

పార్క్ స్థలంలో ఆక్రమణలు, రహదారి నిర్మాణంపై విచారణ జరపాలి

Date : 31 October 2026 05:47 PM Views : 45

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని కేసీఆర్ పార్క్‌కు కేటాయించిన భూమిని పరిరక్షించాలని ఇస్నాపూర్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుడు మొహమ్మద్ నిజాముద్దీన్ బాబా అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం టీజీఐఐసీ జోనల్ కమిషనర్ ఆర్. విఠల్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.పార్క్ ఏర్పాటుకు కేటాయించిన సుమారు 10 ఎకరాల భూమిలో కొంత భాగం ఆక్రమణకు గురైనట్లు, పార్క్ స్థలం నుంచి రహదారి నిర్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్క్ కోసం కేటాయించిన భూమి పరిరక్షణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. భూమికి సంబంధించిన సర్వే నంబర్లు, హద్దులు, ఆమోదిత నమూనా ప్రణాళిక, ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు.విచారణలో ఆక్రమణలు లేదా అనధికార నిర్మాణాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో పార్క్ స్థలం ఆక్రమణకు గురికాకుండా సర్వే రాళ్లు ఏర్పాటు చేసి, భూమి హద్దులను స్పష్టంగా నిర్ణయించాలని సూచించారు. అలాగే పార్క్ భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసి, కేటాయించిన స్థలాన్ని పూర్తిస్థాయిలో పరిరక్షించాలని మొహమ్మద్ నిజాముద్దీన్ బాబా అధికారులను కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :