Thursday, 24 September 2026 12:22:54 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

శ్రీ కనకదుర్గ డ్రై క్లీనింగ్ లాండ్రీ షాప్ దగ్ధం.. షార్ట్ సర్క్యూట్‌తో 3 నుంచి 4 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని విష్ణు ఆవేదన!

Date : 03 August 2026 09:48 PM Views : 62

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీరంగూడ డివిజన్ పరిధిలో ఉన్న జయలక్ష్మీ నగర్ కాలనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని రోడ్డు నంబర్ 3 లక్ష్మీనగర్ లో గల ‘శ్రీ కనకదుర్గ డ్రై క్లీనింగ్ & లాండ్రీ’ షాపులో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి షాప్ అంతా తగల బడింది. ఈ ప్రమాదంలో షాప్ పూర్తిగా దగ్ధమైంది.లాండ్రీ షాప్ ఓనర్ విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 7:00 నుండి 7:30 గంటల ప్రాంతంలో ఈ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. షాప్ ముందు ప్రాంతంలో ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఫోన్ చేసి సమాచారం అందించడంతో తాను అక్కడకు చేరుకునేసరికి షాప్‌లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి.ఈ ప్రమాదంలో సుమారు 70 నుంచి 80 జతల కస్టమర్ల బట్టలు, డ్రై వాష్ మరియు ఐరన్ బట్టలు, ఇనుప మడతలు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయని ఓనర్ విష్ణు తెలిపారు. ఈ సంఘటన ద్వారా తాను 3 నుంచి 4 లక్షల రూపాయలు నష్టపోయినట్టు ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని విష్ణు విజ్ఞప్తి చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :