ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ డివిజన్ పరిధిలో బొంబాయి కాలనీ బస్తీ దవాఖానా, ఎల్‌ఐజీ కాలనీ సొసైటీ కార్యాలయం సమీపంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డాక్టర్ ఆశుతోష్, బస్తీ దవాఖానా ఏఎన్‌ఎంలు యమున, సారా, ఎల్‌ఐజీ కాలనీ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, మైనారిటీ సీనియర్ నాయకుడు గౌస్, నరసింహతో పాటు ఇతర నాయకులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు