ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రాబోయే వినాయక చవితి, గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు గుమ్మడిదల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, యువజన సంఘాల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు నిర్వాహకులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులు వివరించారు. ముఖ్యంగా విద్యుత్ భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, గణేష్ ఊరేగింపుల నిర్వహణ, ధ్వని వ్యవస్థల వినియోగానికి సంబంధించిన నిబంధనలు, రహదారులకు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే సంబంధిత శాఖలకు సమాచారం అందించి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సహకరించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు కోరారు.గణేష్ ఉత్సవాలను మత సామరస్యం, సోదరభావంతో శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తూ పోలీస్ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని సూచించారు.సమావేశంలో సీఐ జిన్నారం రమణారెడ్డి, ఎస్‌ఐ గుమ్మడిదల అరుణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ దశరథ్, విద్యుత్ శాఖ ఏఈతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Admin
ప్రజా పిలుపు