Monday, 09 November 2026 03:09:19 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

420 హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలి: బీఆర్‌ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్

Date : 02 September 2026 02:56 PM Views : 97

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను తక్షణమే అమలు చేసి, వాటిపై ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు మాద్రి పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు.బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఆదేశాలతో, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టిన వారం రోజుల పోరుబాటలో భాగంగా పటాన్‌చెరులో తొలిరోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని ఎంజీ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు 420 హామీలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేయాల్సిన హామీలను వివరిస్తూ ప్రజలకు ‘బాకీ హామీల కార్డులు’ పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వెయ్యి రోజులు దాటినా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇంతకాలం గడిచినా వాటి అమలుపై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని అన్నారు.రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేదలు, సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.పటాన్‌చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి డివిజన్‌లో ప్రజా సమస్యలు, హామీల అమలుపై బీఆర్‌ఎస్ పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తుందని పృథ్వీరాజ్ తెలిపారు.ప్రజల తరఫున ప్రశ్నిస్తాం.. ప్రజల కోసం పోరాడతాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్, మాజీ చైర్మన్, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, మహిళా నాయకులు, ఎంఆర్‌ఆర్ యువసేన సభ్యులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :