Friday, 25 September 2026 09:30:02 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

పటాన్‌చెరులో ఘనంగా పలారం బండి ఊరేగింపు

Date : 11 August 2026 09:45 PM Views : 253

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి పలారం బండి ఊరేగింపు వైభవంగా జరిగింది. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జలగరి ఎట్టయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్, ఎండీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాద్రి పృథ్వీరాజ్, కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాలు, అమ్మవారి నామస్మరణల మధ్య సాగిన ఊరేగింపులో మహిళలు, యువతతో పాటు వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పుల మోతకు మాద్రి పృథ్వీరాజ్, జలగరి ఎట్టయ్య ఉత్సాహంగా నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనడంతో మత సామరస్యం వెల్లివిరిసింది.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలు, ముదిరాజ్ బంధుమిత్రులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ ఐక్యత, అభివృద్ధి కోసం భవిష్యత్‌లో మరిన్ని సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ముదిరాజ్ సంఘం నాయకుడు సఫాన్ దేవ్ తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :