ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి ఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన తొలి వీర మహిళగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి ఉద్యమ నాయకులు ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఐలమ్మ ఆశయాలను, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, కార్యవర్గ సభ్యులు సాయి వరాల, సభ్యులు కృష్ణచారి, వడ్ల సర్వేష్, మల్లేశం, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు