ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ గ్రామానికి చెందిన ధనలక్ష్మి (42) తన కుమారుడు తనిష్‌తో కలిసి ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.ఈ ఘటనపై ఆమె భర్త సింహాద్రి జగన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పటాన్‌చెరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎం. రవీందర్ తెలిపారు.తప్పిపోయిన మహిళ, బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ధనలక్ష్మి, తనిష్ ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు