Thursday, 24 September 2026 08:05:58 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన చిట్కుల్ కాంగ్రెస్ నాయకులు

త్వరలో బీఆర్ఎస్‌లో చేరేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు సిద్ధం

Date : 01 September 2026 04:14 PM Views : 227

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. పటాన్‌చెరు మండల బీఆర్ఎస్ ఇన్‌చార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్‌తో కలిసి కోకాపేటలోని హరీష్ రావు నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు.ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులతో పాటు చిట్కుల్ గ్రామ అభివృద్ధి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. అనంతరం చిట్కుల్ కాంగ్రెస్ నాయకులు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పార్టీ నాయకత్వం చేస్తున్న పోరాటాల పట్ల ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.త్వరలో చిట్కుల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా సంకేతాలు వెలువడ్డాయి. పెద్ద సంఖ్యలో నాయకులు పార్టీ మారే అవకాశం ఉండటంతో ఈ పరిణామం పటాన్‌చెరు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధి, చిట్కుల్ గ్రామ ప్రజల సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చిట్కుల్ గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు వల్లెపు వెంకటేష్, రాజ్ కుమార్, మురళి యాదవ్, కాంగ్రెస్ నాయకులు మడగుల సంతోష్, మంజలి శ్రీను, వల్లెపు రాయుడు, భీమ, యాది, మాడుగుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు తలారి ఆంజనేయులు, బేగరి వెంకటేష్, కో-ఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, గుండారపు సంపత్ పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :