Friday, 25 September 2026 10:00:45 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం

*రూ.3 లక్షల రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్న లక్ష్మణ్*

Date : 24 September 2026 10:53 PM Views : 27

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీరంగూడ : శివాలయం క్రాస్‌లో శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తుల కోలాహలం మధ్య నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాటతో పాటు వెండి నాణేల వేలం పాట నిర్వహించారు.లడ్డూ వేలం పాటలో వందనపురి కాలనీకి చెందిన లక్ష్మణ్ రూ.3 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. గత ఏడాది నిర్వహించిన లడ్డూ వేలం పాటలో లడ్డూ రూ.4.50 లక్షలకు వేలం వెళ్లినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది కూడా లడ్డూ వేలం పాటకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.గణనాథుడి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వెండి నాణేల వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి వెండి నాణేన్ని సుల్తాన్‌పూర్‌కు చెందిన శ్రీకాంత్ రూ.70 వేలకు కైవసం చేసుకున్నారు. రెండో వెండి నాణేన్ని ఎన్ ఆర్ ఐ కాలనీ చెందిన రాజేష్ రూ.58 వేలకు దక్కించుకున్నారు. మూడో వెండి నాణేన్ని వికాస్ రూ.42 వేలకు కైవసం చేసుకున్నారు.నాల్గో వెండి నాణేన్ని మల్లికార్జున్‌నగర్‌కు చెందిన సుజయ్ రూ.60 వేలకు, ఐదో వెండి నాణేన్ని ఇసుకబావి ప్రాంతానికి చెందిన తోట రాజు రూ.46 వేలకు కైవసం చేసుకున్నారు. వేలం పాట సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఉత్సవ ప్రాంగణంలో సందడి నెలకొంది.నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్‌కుమార్ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సంగీత విభావరి నిర్వహించారు. కళాకారులు ఆలపించిన పాటలు భక్తులను, స్థానికులను అలరించాయి. యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సంగీత విభావరిని ఆస్వాదించారు.గత 15 సంవత్సరాలుగా శివాలయం క్రాస్‌లో గణనాథుడిని ప్రతిష్ఠించి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం గణనాథుడిని నిమజ్జనం చేశారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన భక్తులు, స్థానికులు, దాతలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సుధాకర్ యాదవ్, శశిధర్ రెడ్డి, గొల్ల మల్లేష్, కురుమ మల్లేష్, పిల్లే శ్రీనివాస్, మచ్చేందర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ బిల్డర్, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాములు గౌడ్, కృష్ణ, బిక్షపతి, రమేష్ యాదవ్, సురేష్, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :