ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం, పాశంమైలారం, చిట్కుల్ వార్డుల్లో సుమారు రూ.2.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు,మురుగు కాలువలు,పారిశుద్ధ్యం, తాగునీరు,విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తూ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత శ్రీకాంత్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, గాయత్రి పాండు, కౌన్సిలర్లు పాండు, సంధ్య నవీన్ రెడ్డి, లత వెంకటేష్, రాజు, ఆంజనేయులు, వెంకటేష్, అరుణ్, కోఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, బాబా, అసీయ బేగం, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి, కృష్ణ, రాజు, బండ రాజు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు