ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం జర్నలిస్టులంతా ఐక్యంగా,సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం,ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్–ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,ఎంఏ.ఫైజల్అన్నారు.రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో పటాన్‌చెరు నియోజకవర్గ టీయూడబ్ల్యూజే–ఐజేయూ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫైజల్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యూనియన్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.టీయూడబ్ల్యూజే–ఐజేయూకు సుమారు 70 ఏళ్ల చరిత్ర ఉందని, సుదీర్ఘకాలంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సంఘం పోరాడుతూ వస్తోందని ఫైజల్ తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ సంఘం జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లిపరిష్కారానికికృషిచేస్తోందన్నారు.జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమం, ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో జర్నలిస్టులకు బస్సు పాస్ సౌకర్యం కల్పించడంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ పోషించిన పాత్ర మరువలేనిదని ఫైజల్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు అందేలా కృషి చేస్తామని తెలిపారు.జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యక్తిగతంగా కాకుండా సంఘటితంగా పరిష్కరించుకునే విధంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే–ఐజేయూలో ప్రతి జర్నలిస్టుకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. జర్నలిస్టుల గౌరవం,భద్రత,హక్కులకు భంగం కలిగినప్పుడు అందరూ ఒకే వేదికపైకి వచ్చి సంఘటితంగా గొంతెత్తాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో జిల్లా కమిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ పటాన్‌చెరు జర్నలిస్టుల సమిష్టి కృషి,సహకారంతోనే తాను అంచెలంచెలుగా జిల్లా స్థాయికి ఎదిగానని తెలిపారు. పటాన్‌చెరు జర్నలిస్టుల సహకారాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని,వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సభా వేదికగా పటాన్‌చెరు జర్నలిస్టులకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. సంఘం బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.ఇటీవల నిర్వహించిన ఐజేయూ జాతీయ సమావేశంలో సంగారెడ్డి జిల్లా నుంచి జర్నలిస్టులు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వ్యవహరించి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితోసంఘకార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టుల ఐక్యతే సంఘానికి బలమని, ప్రతి సభ్యుడు బాధ్యతతో వ్యవహరించినప్పుడే సంఘం మరింత బలోపేతం అవుతుందని అన్నారు.సమావేశం అనంతరం పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ టీయూడబ్ల్యూజే–ఐజేయూనూతనకార్యవర్గాన్నిఏకగ్రీవంగాఎన్నుకున్నారు.అధ్యక్షుడుపత్తినర్సింహా,ప్రధానకార్యదర్శి,యాదగిరి,సలహాదారులు కాశీపతి, సులేమాన్, రామారావు ఉపాధ్యక్షులు విఠల్, నగేష్, శివకుమార్, జెమిని రాజు, రమేష్ ,జాయింట్ సెక్రటరీలు వేణు, ప్రభాకర్, శ్రీనివాస్, కోటేష్,శివాజీ,ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఆంజనేయులు, గాండ్ల మహేష్,వివేక్, జీవరత్నం,రాజు,కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి,ఈసీ సభ్యులు శ్రీనివాస్, శంకర్, శేఖర్, మహేందర్ గౌడ్, సిద్దు, శ్రీనివాస్ మామా, రాజశేఖర్, ప్రదీప్ రెడ్డి, విజయ్, నాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర,జిల్లా నాయకులతో పాటు తోటి జర్నలిస్టులు అభినందించారు.నూతన కార్యవర్గం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం,హక్కుల పరిరక్షణ,సంక్షేమం కోసంసమష్టిగాపనిచేయాలనిఆకాంక్షించారు.టీయూడబ్ల్యూజే–ఐజేయూ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి చెన్న బసవేశ్వర్అధ్యక్షతన సమావేశం జరిగింది.ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆసీఫ్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనాథ్, జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా జాయింట్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్, ఫోటోగ్రాఫర్ జిల్లా అధ్యక్షుడు ఆరీప్, చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్దిఖ్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చౌహాన్త దితరులుపాల్గొన్నారు.సమావేశంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొని తమ సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, జర్నలిస్టుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
Admin
ప్రజా పిలుపు