ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు రూరల్ పరిధిలో శనివారం (విద్యుత్ లైన్లపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపట్టనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తాత్కాలిక అంతరాయం కలగనుంది. ఐనోల్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ సత్యసాయి, ఇంద్రేశం ఫీడర్లపై మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అదేవిధంగా గోశాల సబ్‌స్టేషన్ పరిధిలోని శివాలయం ఫీడర్‌పై మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆయా ఫీడర్ల పరిధిలోని కాలనీల ప్రజలు, విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, పనులకు సహకరించాలని సంబంధిత ఏఈ కోరారు.
Admin
ప్రజా పిలుపు