Thursday, 24 September 2026 08:05:50 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

Date : 22 September 2026 04:29 PM Views : 20

ప్రజా పిలుపు / తెలంగాణ / Nalgonda : ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో ఉన్న భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని ఎర్రవల్లి యాదవులు ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమకు 30 ఎకరాల భూమిని పంపిణీ చేసి పట్టాలు అందజేశారని వారు తెలిపారు.ఈ సర్వే నంబర్‌లో దళితులతో పాటు అన్ని కులాల వారికి భూములు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. గతంలో రాళ్లు, గుట్టలతో సాగుకు అనువుగా లేని ఈ భూములను కేసీఆర్ ప్రభుత్వం పాండురంగ జలాశయం, కోణం చెరువుల అభివృద్ధి ద్వారా సాగుకు అనుకూలంగా మార్చిందని యాదవులు తెలిపారు.సర్వే నంబర్ 325లో కేసీఆర్‌కు ఎలాంటి భూమి లేదని వారు స్పష్టం చేశారు. తమ వద్ద పాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని, వాటి ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నామని తెలిపారు. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాతే సర్వే నంబర్ 325ను నిలిపివేసి, ఎర్ర గుర్తు పెట్టారని ఆరోపించారు.తమ భూములకు ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేసి, సమస్యను పరిష్కరించాలని ఎర్రవల్లి యాదవులు విజ్ఞప్తి చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :