ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : సీఎం సహాయనిధి పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తీగుల్ మాజీ సర్పంచ్ యువజన కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కప్పర భాను ప్రకాశ్ రావు అన్నారు. జగదేవపూర్ మండలానికి చెందిన పలువురుఅనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చేరారు. హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం అధికంగా డబ్బులు ఖర్చు కాగా తీగుల్ మాజీ సర్పంచ్ యువజన కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కప్పర భాను ప్రకాశ్ రావు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి సీఎం సహాయనిధి అప్లై చేయగా వారికి టి పి సి సి రాష్ట్ర అధికార ప్రతినిధి భండారు శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో ఐదు మంది లబ్ధిదారులకు మంజూరైన1,50,000 వేల రూపాయల చెక్కులను కప్పర భాను ప్రకాశ్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బునారి రాజు వార్డు గోవిందు మనోజ్ కుమార్ లు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు