ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన పోలీసుల దాడి, అనుచిత ప్రవర్తనను ఖండిస్తూ పటాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి బీఆర్‌ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ నిరసనలో పాల్గొన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, పటాన్‌చెరు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మైత్రి మైదానం నుంచి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా ఎమ్మెల్యేల గౌరవాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన పోలీసుల దాడి, అనుచిత ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని తెలిపారు.మహిళల గౌరవం – ప్రజాస్వామ్యానికి గౌరవం. అన్యాయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుంది” అని సింధు ఆదర్శ్ రెడ్డి స్పష్టం చేశారు.
Admin
ప్రజా పిలుపు